ఆ కాలనీ ఏర్పడి 50 ఏళ్ళు గడుస్తున్నాయి. నేటికీ పక్క డ్రైనేజీ సౌకర్యం లేదు. రహదారులు పూర్తి స్థాయిలో నిర్మించలేదు. వర్షం వస్తే కాలనీ నీట మునుగుతుంది. వర్షపు నీరు బయటకు తోడుకోలేక ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణానాతీతం. ఆకివీడు సమితిగా ఉన్న సమయంలో అప్పటి సమితి ఛైర్మెన్ పీవీల్ తిమ్మరాజు మండలంలోని దుంపగడపలో కాలనీ నిర్మించారు. దళితులకు కేటాయించిన ఈ కాలనీ లో సుమారు 150 మందికిపైగా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించారు. అప్పటినుంచే కాలనీ లో రోడ్డు అంతంతమాత్రంగానే ఉంది. ఇటీవల కొన్ని సిమెంట్ రోడ్లు నిర్మించారు. అయితే కాలనీ లో ఒక్క డ్రైయిన్ కూడా నిర్మించలేదు. దింతో ప్రజల వాడకం నీటితో పలు ప్రాంతాలు మురికి కంపాలుగా మారుతున్నాయి. పక్క డ్రైనేజీ ఏర్పాటు చెయ్యాలని కాలనీ వాసులు అనేకసార్లు మొరపెట్టుకున్నా పాలకులు స్పందించలేదని వాపోతున్నారు. ఎస్సి ఏస్టి సబ్ ప్లాన్ నిధులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని, ఏళ్ళ తరబడి ఉన్న కాలనీ లో కనీస సౌకర్యం కల్పించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ కి పక్క డ్రైనేజ్ కల్పించాలని కోరుచున్నారు.