19-DEC-2018
ఆకివీడు: పేదల కోసం మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు సేకరించిన 74 ఎకరాల భూమి మొత్తాన్ని పేదలకే పంచాలని సీపీఎం నాయకుల బృందం తహసీల్దార్ కు మంగళవారం వినతి పత్రం అందచేశారు. సేకరించిన భూమిని పదేళ్లుగా పంచకుండా కాలయాపన చేయడం తగదని ఆ పార్టీ జిల్లా నాయకుడు బి.సత్యనారాయణ అన్నారు. ఏటా లేఅవుల్ చేస్తామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ప్రకటించిన ఎమ్మెల్యే వీవీ శివరామరాజు కనీస సౌకర్యాలు లేకుండా లేఅవుట్ ఫూర్తిగా వేయకుండా పట్టాలిస్తామని ప్రకటించడం ధారుణమన్నారు. రోడ్డుకన్నా దిగువ భాగంలో ఉన్న ఈ భూమిని పుడిచేందుకు చాలా ఖర్చవుతుందని, మౌలిక సదుపాయాలైన రోడ్లు, మంచినీరు, విద్యుత్ ఏవీ లేకుండానే పట్టాలివ్వడం వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. గతంలో 2,506 మందికి పేదలకు పట్టాలిచ్చారని, అర్హులందరికీ పట్టాలిచ్చి ఇళ్లు నిర్మించాలని డిమేండ్ చేసారు.
ఈ భూమిలో 5 ఎకరాల్లో సబ్ స్టేషన్ నిర్మించాలని, మంచినీటి చెరువు తవ్వించాలని తదితర వాటి కోసం భూమి కేటాయించడం తగదన్నారు. గతంలో పట్టాలు తీసుకున్న వ్యక్తుల మరణిస్తే వారి వారసులకు పట్టాలు ఇవ్వాలని డిమేండ్ చేసారు. దీనిపై తహసీల్దార్ నాగార్టునరెడ్డి మాట్లాడుతూ సర్వే మరో వారంలో పూర్తవుతుందని, పట్టాల జాబితా త్వరలోనే అందరికీ అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమలలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.