ఆకివీడు. న్యాయమూర్తిగా కొనసాగుతూనే ఆంద్రా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పొందారు “ఆకివీడుకు చెందిన అమర రంగేశ్వరరావు. దేశంలో అవినీతి నిరోధక చట్టాలు, వాటి అమలుకు ఉన్న వ్యవస్ధలపై లోతైన అధ్యయనం చేసారు. 2013 లో ప్రారంభించిన అధ్యయనం పరిశోదనా పాత్రలను ఈ ఏడాది మార్చిలో యూనివర్సిటీకి సమర్పించారు. దీంతో యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేస్తూ వర్తమానం పంపింది. రంగేశ్వర రావు 2008 లో జూనియర్ సివిల్ జడ్జిగా తునిలో బాధ్యతలు స్వీకరించారు. సత్తెనపల్లి, అవనిగడ్డ సివిల్ జడ్జిగా పనిచేసి, ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు కోర్ణు సివిల్ జడ్జిగా పనిచేస్తున్నారు. ఆవినితీ నిరోధక చట్టాలపై సుదీర్ఘంగా అధ్యయం చేసి డాక్టరేట్ పొందిన రంగేశ్వరరావును ఆకివీడు ప్రముఖులు అబినందించారు.