ఆకివీడు సిద్దాపురం గ్రామాల సరిహద్దుల్లో ఉన్న పంట భూమిని బీడు భూమిగా మార్చేశారు. ఈ భూములకు సమీపంలో రెండు వైపులా చేపల చెరువులు ఉండటంతో వరి సాగు కొనసాగడంలేదు. వర్షాలకు పంట నీట మునుగుతోందని, చెరువుల ఊట నీటితో దిగుబడులు రావడంలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చేపల చెరువులు తవ్వెందుకు ఈ ఏడాది ఖరీఫ్ సాగు చేపట్టలేదు సాగు చేసిన వరి మొక్కలు కుదుళ్ళు వెయ్యడం లేదని, కంకుల దిగుబడి పడిపోతుందని వాపోతున్నారు. ప్రభుత్వం చేపల చెరువులకు తవ్వకానికి నిరాకరించడంతో తమ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. రెండు పంటలు పుష్కలంగా ఉండే తమ భూముల సరిహద్దుల్లో చేపల చెరువుల తవ్వకానికి ఎందుకు అనుమతి ఇచ్చారని వారు ప్రశ్నిస్తున్నారు.