ఆకివీడు మండలం సిద్దాపురం పంచాయతీ పరిధిలో కురుపాక గ్రామంలోని బలే కార్తికరాజు నివాసం వద్ద వేప చెట్టు నుంచి పాలు స్రవించాయి. ఆదివారం ఉదయం నుంచి ఇలా పాలు రావడం గమనించామని, సాయంత్రం నుంచి మరింత పెరిగాయని యజమాని తెలిపారు. వేపచెట్టు వయస్సు సుమారు 6 సంవత్సరాలు ఉంటుందని చెబుతున్నారు. చెట్టును ఎక్కడ నరకలేదని తెలిపారు. చెట్టు పై భాగంలో నుంచి పాలు కారుతుండటం విశేషం. ఈ విషయం గ్రామం అంత తెలియడంతో ప్రజలు తండోప తండాలుగా వచ్చి పాలు కారుతున్న దృశ్యాన్ని వీక్షిస్తున్నారు. చీకటి అయినప్పటికీ మహిళలు సైతం ఆ చెట్టు ను చూసేందుకు తరలివస్తున్నారు. సోమవారం నుంచి పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.