ఆదివారం రాత్రి ఇంటికి తాళాలు వేసి చర్చి కి వెళ్లి వచ్చే సరికి బీరువా పగలకొట్టి నగదు , బంగారం దోగిలించిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. 10వ వార్డు లో లాంచీల రేవు సమీపంలో నివాసం ఉంటున్న చిట్టాల సుబ్బారావు, భార్య, పిల్లలు ఇంటికి తాళం వేసి చర్చి కి వెళ్లి తిరిగివచ్చేసరికి ఇంటి తాళం పగలకొట్టి ఉంది. లోపలకు వెళ్లి చూడగా బీరువాలో ఉంచిన డ్వాక్రా సొమ్ము రూ.43 వేలు , మూడున్నర కాసుల బంగారపు గొలుసులు రెండు , చెవిదుద్దులు చోరీకి గురైనట్టు గుర్తించారు. బాధితులు సోమవారం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. స్థానికులే ఈ చోరీకి పాల్పడి ఉంటారని ఫిర్యాదులో బాధితులు అనుమానం వ్యక్తం చేసారు. ఎస్సై సుధాకర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.