* తరగతి గదుల్లో చరవాణి నిషేదం
* విద్యాశాఖ మరోసారి హెచ్చరిక
ఆకివీడు. : తరగతి గదుల్లో చరవాణి వాడకం నిషేధంపై జిల్లా విద్యాశాఖ మరోసారి హెచ్చరికలు జారీచేసింది. ఈ మేరకు మంగళవారం జిల్లాలోని అన్ని మండల విద్యశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. భీమవరం ప్రాంతంలోని ఓ పాఠశాల తరగతి గదిలో ఉపాద్యాయుడు చరవాణి వినియోగిస్తున్నారు అని ఫిర్యాదు అందింది. అయితే విచారణలో సదరు ఉపాద్యాయుడుపై విద్యార్థులు, గ్రామస్తుల నుంచి అభిప్రాయం వెల్లడైంది. ఈ నేపథ్యంలో మరోసారి హెచ్చరిక జారీ చేసినట్లు తెలిసింది దీని మేరకు పాఠశాలకు వెళ్లిన తరువాత ఉపాధ్యాయులు తమ చరవాణులను ప్రధానోపాధ్యాయుడుకి అప్పగించాలి. నిబంధనలు పాటించక పోతే ఇద్దరిపై చర్యలు తీసుకుంటారు.
పూర్తి బాధ్యత ప్రధానోపాధ్యాయుడుదే:
ప్రభుత్వ పాఠశాలలో చరవాణి ఉపయోగిస్తే ఉపాద్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు ఇద్దరు బాద్యులే. తప్పని సరయితే ప్రధానోపాధ్యాయుడి అనుమతి తీసుకోవాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ఏలూరు డిఈవో సీవీ రేణుక చెప్పారు.
సీవీ రేణుక. డిఈవో. ఏలూరు.