పురపాలక స్థాయికి ఎదిగిన ఆకివీడు పంచాయతీలో మురుగునీటి పారుదలకు అధికారులు చర్యలు చేపట్టారు. 15 ఏళ్ళ కిందట ప్రపంచ బ్యాంకు నిధులతో జాతీయ అనుకోని నిర్మించిన మురుగు నీటి కాలువల ఆక్రమణల కారణంగా పూడిపోయి నిరుపయోగంగా మారింది. ఫలితంగా గ్రామంలో ఉన్న 20 వార్డు ల మురుగు నీటి ఆటంకం ఏర్పడింది కొద్దిపాటి వర్షాలకు పల్లపు ప్రాంతాలు, అంతర్గత, జాతీయ రహదారులు నీట మునిగిన సందర్భాలు ఇటీవల అనేకం వెలుగుచూశాయి. శాంతినగర్ ముంపు బెడదపై సిపిఎం నాయకులూ ధర్నాలు కూడా చేసారు. ప్రత్యేకాధికారుల పాలనా అమలులోకి వచ్చాక సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేక అధికారి నాగార్జునరెడ్డి సూచనా మేరకు కార్యదర్శి ఠాగూర్ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆక్రమణలను తొలగిస్తూ మురుగునీటి పారుదల చర్యలు తీసుకున్నారు.
ప్రజలు సహకరిస్తే మరింత అభివృద్ధి : గ్రామాభివృద్ధికి ప్రజలు పూర్తి సహకారం అందించాలి. పార్టీలకు అతీతంగా స్పందించాలి. ప్రస్తుతం జాతీయ రహదారిని అనుకునిఉన్న ప్రధాన మురుగు కాలువను ప్రక్షాళన చేస్తున్నాం. సిబ్బంది కొరత కారణంగా ప్రైవేట్ సిబ్బంది తో పనులు చేపట్టాం. ప్రజలు, నాయకులూ సిబ్బందికి సహకరించాలి. న్.ఠాగూర్, ఈఓ, ఆకివీడు