మద్యం పేరుతో మహిళల మాంగళ్యాన్ని దోచేస్తున్నారని ఐద్వా సీనియర్ నాయకురాలు మారుబోయిన సావిత్రమ్మ ఆవేదన వ్యక్తం చేసారు. ఐద్వా జిల్లా కమిటీ ఆ...
4:32:00 PM
మద్యం పేరుతో మహిళల మాంగళ్యాన్ని దోచేస్తున్నారని ఐద్వా సీనియర్ నాయకురాలు మారుబోయిన సావిత్రమ్మ ఆవేదన వ్యక్తం చేసారు. ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన మద్యంపై పోరుయాత్రను సోమవారం ఆమె ఆకివీడు లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మద్యం కోసం పుస్తెలు తెంపుకుని మగాళ్లు తాగేస్తున్న ప్రభుత్వం కళ్ళు తెరవడంలేదు అన్నారు. మద్యంతో వచ్చే ఆదాయంతో ప్రభుత్వం నడపడం దారుణమన్నారు. మహిళలు కన్నీళ్లతో రాష్ట్రాన్ని ఏలడం మంచిది కాదన్నారు. ఐద్వా జిల్లా కార్యదర్శి కళ్యాణి మాట్లాడుతూ మహిళల, బాలికలపై దాడులు జరుగుతుంటే పాలకుల కళ్ళు మూసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మంచినీరు దొరకని గ్రామాలూ వేలకు వేలు ఉన్నాయని కానీ మద్యం దొరకని వీది లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో మద్యం నిషేదించాలని ఆమె డిమాండ్ చేసారు. మహిళలో చైతన్యం తీసుకువచ్చి డిసెంబర్ 3 సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా చేస్తామన్నారు .
Copyright©2024 All Rights Reserved. Manaakividuinfo.com Website.